వినాయక్‌నగర్, సెప్టెంబర్ 24: ఖమ్మంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నిజామాబాద్‌కు చెందిన ఎంఐఎం నాయకుడు మునవార్ అలీ ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు. దీంతో నగరంలోని అతడి నివాసంలో మంగళవారం తనిఖీలు చేశారు. అలీ తల్లి ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా మీదుగా భారీగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది.
ఈ నేపథ్యంలో అటువైపు వస్తున్న కార్లను తనిఖీ చేయగా, ఓ కారులో రూ.కోటి విలువ చేసే 300 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారిలో నిజామాబాద్‌కు చెందిన మునావర్ అలీ కూడా ఉన్నారు. అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. అలీపై నిజామాబాద్ జిల్లాతో పాటు ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాల్లో గంజాయి కేసులు నమోదు కాగా, జైలుశిక్ష సైతం అనుభవించాడు. అతడి గత చరిత్రను గుర్తించిన ఎస్టీఎఫ్ బృందం.. నగరానికి వచ్చి మునావర్ అలీ ఇంటిపై దాడి చేసింది. కానీ, ఎలాంటి గంజాయి లభించలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.