నవీపేట, జనవరి 13: సంక్రాంతి పండుగ సందర్భంగా మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సంతలో రికార్డు స్థాయిలో క్రయవిక్రయాలు జరిగాయి. ఒక్కరోజే రూ.3.50 కోట్లకుపై జీవాల క్రయవిక్రయాలు జరిగినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. సంతకు మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి వ్యాపారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో సంత మొత్తం అమ్మకం, కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. ఒక్కో మేకకు రూ. 12వేలకుపైగా ధర పలకడం గమనార్హం.