Nizamabad | పోతంగల్, జనవరి 27 : వైద్య సిబ్బంది తప్పనిసరిగా సకాలంలో విధులకు హాజరుకావాలని డీఎంఅండ్‌హెచ్‌వో రాజశ్రీ సిబ్బందిని ఆదేశించారు. పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని మందులు, పలు రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి పరిధిలో గర్భిణుల వివరాల నమోదు, ఓపీ తదితర విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని, చికిత్సలో ఎలాంటి అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కరణ్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయప్రకాష్, హెల్త్ సూపర్వైజర్ సావిత్రి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.