మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగిన స్థలాలను కామారెడ్డి అదనపు ఎస్పీ (Additional SP ) చైతన్య రెడ్డి (Chaitanya Reddy ) బుధవారం పరిశీలించారు. గత ఏడాదికాలంగా కామారెడ్డి (Kamareddy) నుంచి సిరిసిల్ల ( Siricilla) వెళ్లే రహదారి పై రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను సంబంధిత అధికారులతో పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, భవనాలు, ట్రాఫిక్ అధికారులతో కలిసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట కామారెడ్డి రూరల్ సీఐరామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్ ఉన్నారు.