వినాయక్‌నగర్, మే 20: జిల్లాలో సివిల్ ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ సాయి చైతన్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలోని ఒకే పోలీసుస్టేషన్లో లాంగ్ స్టాండింగ్‌లో ఏడు, నాలుగు, మూడేండ్లుగా పనిచేస్తున్న వారి వివరాలు సేకరించి, ట్రాన్స్ఫర్ చేశారు.
ఒకే ఠాణాలో మూడేండ్లుగా పనిచేస్తున్న 22 మంది ఏఎస్సైలు, నాలుగేండ్లు పనిచేస్తున్న 26 మంది హెడ్ కానిస్టేబుళ్లతోపాటు ఏడేండ్లుగా ఒకే స్టేషన్లో పనిచేస్తున్న 116 మంది కానిస్టేబుళ్లకు స్థానచలనం కల్పించారు. ట్రాన్స్ఫర్ అయిన సిబ్బందిని వెంటనే రిలీవ్ చేయాలని సంబంధిత ఏసీపీలు, సీఐలు, ఎస్సైలకు సూచించారు. బదిలీ అయిన సిబ్బంది త్వరగా తమకు కేటాయించిన పోలీసుస్టేషన్లకు వెళ్లి రిపోర్టు చేయాలని సీపీ ఆదేశాలు జారీచేశారు.