వినాయక నగర్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ఓ తాళం వేసిన ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడి బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు ( Theft ) . స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబీబ్‌నగర్ కాలనీకి చెందిన హమీద్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం శుభకార్య నిమిత్తం మహారాష్ట్రకు ( Maharastra ) వెళ్లారు.
ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు ఇంటి తాళం ధ్వంసం చేసి బెడ్రూంలోని బీరువాను కొల్లగొట్టారు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు నాలుగు లక్షల నగదుతో పాటు, మూడు తులాల బంగారు నగలను దోచుకువెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.