బాల్కొండ : శ్రీరాంసాగర్(Sriramsagar) బ్యాక్ వాటర్లోకి చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందాడు. బాల్కొండ గ్రామానికి చెందిన బట్టు నారాయణ(55) రోజువారీగా చేపలు పట్టడానికి శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ లోకి వెళ్లాడు. బ్యాక్ వాటర్లో చేపలు పట్టే క్రమంలో చేపలకోసం పెట్టిన కంద్రి లో చిక్కుకుని నీటిలో మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.