భక్తవశంకరుడు, భోళా శంకరుడు అయిన పరమేశ్వరుడి పూజకు వేళయ్యింది. మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడి, బోధన్‌లోని ఏక చక్రేశ్వరాలయం, ఆర్మూర్‌లోని సిద్ధుల గుట్ట, కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లోని సిద్ధరామేశ్వరాలయం,
నాగిరెడ్డిపేట మండలం తాండూర్లోని త్రిలింగేశ్వరాలయం, రామారెడ్డి మండలంలోని మద్దికుంట బుగ్గ రామేశ్వరాలయం, తాడ్వాయి మండలం సంతాయిపేట భీమేశ్వరాలయం ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఉపవాస దీక్షలకు శివయ్య భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు.
-సుభాష్‌నగర్, ఫిబ్రవరి 25