Cricket kit | పోతంగల్ మే 15: మండలంలోని జల్లపల్లి ఆబాదిలో యువకులకు చైతన్యపరిచేందుకు గురువారం సామజిక సేవా కర్త ఏంఎ హకీమ్ క్రికెట్ కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువులో రాణించాలన్నారు.క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.
ఆనంతరం జల్లపల్లి ఫారంలో పేద కుటుంబానికి చెందిన రఘు- మీరాబాయి దంపతుల రెండో కుమార్తె వివాహానికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన వెంట ఏజాజ్ ఖాన్,షేరు, రాములు, యువకులు తదితరులున్నారు.