మాక్లూర్, జనవరి 1 : కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిసెంబర్ 31న ఒక్కరోజే రూ.11 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. గత నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు రూ.220 కోట్ల ఆదాయం రాగా ఒక్క రోజులోనే రూ.11 కోట్ల ఆదాయం సమకూరింది. 30 రోజుల్లో 2 లక్షల 49వేల 321 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 2లక్షల 75వేల 939 బీర్ కేసులు డిపో నుంచి ఉమ్మడి జిల్లాకు సరాఫరా చేయగా రూ. 220 కోట్ల వ్యాపారం జరిగిందని ఎక్సైజ్ ఎస్సై సుదర్శనం తెలిపారు. డిసెంబర్ 31న ఒక్కరోజే ఉదయం నుంచి రాత్రి వరకు 10,445 ఐఎంఎల్ కేసులు, 12,234 బీర్ కేసులు వైన్సులు, బార్లకు సరఫరా కాగా రూ. 11కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.