కంటేశ్వర్ (నిజామాబాద్ ) : లయన్స్ క్లబ్ ( Lions Club ) ఆఫ్ నిజామాబాద్ డైమండ్ 28వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2025-26 సంవత్సరానికి గాను అధ్యక్షులుగా లయన్ సత్యప్రసాద్ గుప్తా ( Satyaprasad ) , సెక్రెటరీగా లయన్ ఉత్తం కుమార్ ( Uttem Kumar ) , కోశాధికారిగా లయన్ రవికుమార్, ఇతర లయన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ. లయన్స్ సమాజ సేవలో ఎప్పుడూ ముందంజలో ఉంటుందని అన్నారు. సమాజ సేవలో లయన్స్ సభ్యులకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. నూతన కమిటీ సేవా కార్యక్రమాలతో రాష్ట్రస్థాయిలోనే మంచి పేరు సాధించాలని ఆకాంక్షించారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు లయన్ సిర్ప రాజేశ్వర్, మాజీ ట్రెజరర్ లయన్ డి. రాజు , మాజీ సెక్రటరీ లయన్ శ్రీనివాస్, లయన్ హర్దీప్ సింగ్, ,లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.