బాల్కొండ : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా సేవలందించడంలో లయన్స్ క్లబ్(Lions Club ) ముందు వరుసలో ఉందని అంతర్జాతీయ లయన్స్ క్లబ్ డైరెక్టర్ సూర్యరావు (Director Surya Rao) అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్లో లయన్స్ క్లబ్ సొంత భవనాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.
లయన్స్ క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా ప్రజాసేవకు ముందుకు రావాలని కోరారు. గ్రామీణులులయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్లబ్ సభ్యులు జ్ఞాన సాగర్ రెడ్డి, చాకులింగం, దినేష్ పటేల్, సుధీర్ బాబు, శ్రీనివాస్ గుప్తా, జీవన్, వంశి రెడ్డి, కొమ్ముల నరసయ్య, అంజయ్య, కనకయ్య, ప్రసాద్, పోశెట్టి, భోజరాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాతలను సన్మానించారు.