వినాయక్‌నగర్, మే 8: జిల్లా వ్యాప్తంగా జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడానికి చేయూతనివ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవీఎన్ భరత లక్ష్మి కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్లో అదనపు జిల్లా జడ్జి హరీశ్, న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్, అధికారులు, న్యాయవాదులతో గురువా రం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు.
రోడ్డు ప్రమాదం కేసుల్లో నష్ట పరిహారం కోసం దావాలకు తుదిరూపం తీసుకురావడానికి చేదోడుగా నిలుస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ బీమా కంపెనీల న్యాయవాదులు గోవర్ధన్, ఆనంద్ రెడ్డి, అంకిత, గణేశ్ దేశ్‌పాండే, ఎంవీ నరసింహా రావు, వి.భాస్కర్, మోహన్, సదానంద్ గౌడ్, న్యాయవాదులు రఘువీర్ భూపాల్, అల్గోట్ రవీందర్, మహేశ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ పాల్గొన్నారు.