Man Ki Baat | పోతంగల్, జూన్ 29: ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పోతంగల్ బీజేపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆదివారం వీక్షించారు. బూత్ అధ్యక్షుడు సుధం అశోక్ నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసార ఏర్పాటు చేశారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా కార్యక్రమానికి బీజేపీ నాయకులు పోతంగల్ మండలం నుండి పెద్ద ఎత్తున బయలుదేరారు.
కేంద్రమంత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆదివారం వస్తున్న సందర్భంగా మండల నాయకులు బస్సులలో బయలు దేరారు. వెళ్లిన వారిలో కామారెడ్డి జిల్లా పర్యావరణ కమిటీ కో కన్వీనర్ ప్రకాష్ పటేల్, మండల మైనార్టీ అధ్యక్షులు నయీముద్దీన్, హరి నర్సింగ్, ప్రబ్బ శేఖర్, ఓమన్న పటేల్, దిగంబర్ పటేల్, నాగం సాయిలు, కల్లూరి మక్కయ్యా, గజు పటేల్, గిరిధర్, గోవింద్, సంజీవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.