Kotagiri | కోటగిరిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
Kotagiri | కోటగిరి, జూలై 24 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని సర్కార్ దవఖానలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకుడు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ జనం మెచ్చిన నేత, జనం కోసం తపించే నాయకుడు కేటీఆర్ ఆని కొనియాడారు. తెలంగాణ ప్రజల అభ్యుదయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు కేటీఆర్ అని గుర్తు చేశారు.
వర్షాభావ పరిస్థితులు, పేపర్ లీక్ విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ హైదరాబాదులో ఇందిరా పార్కువద్ద నిర్వహించే ధర్నా సందర్భంగా జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకోవద్దని కేవలం సామాజిక కార్యక్రమాలు మాత్రమే చేపట్టాలని ఆదేశాలు ఇవ్వటం వల్ల తాము కూడా అయన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, సీట్లు పంపిణీ చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మోరే కిషన్, శంకర్ గౌడ్, నజీర్, సమీర్, ఏత్తొండ దేవేందర్, మోగులప్ప, కప్ప సంతోష్, చిన్న అరవింద్, గంగా ప్రసాద్ గౌడ్, మోరే గౌతమ్, గగన్, ఉమాకాంత్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

