కామారెడ్డి/ మాక్లూర్, జూలై 5: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా నాయకులకు సూచించారు. హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆయన నివాసంలో బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఉమ్మడి నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు శనివారం కలిశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ వారితో మాట్లాడుతూ.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుబావుటా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్తల కష్టపడి పనిచేయాలని సూచించారు.