తుంగతుర్తి, ఫిబ్రవరి 05 : తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో గురువారం నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలో నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలకు చెందిన క్రీడాకారులు కబడ్డీ, ఖోఖో క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాసీల్దార్ దయానందం మాట్లాడుతూ.. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బోయిని లింగయ్య, పీడీ యాకయ్య, ఉపాధ్యాయులు గుజ్జ భాస్కర్, మల్లెపాక రవీందర్, శ్రీను, వివిధ మండలాల పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.