Sainik School | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రానికి చెందిన కర్నెపోశెట్టి మనవడు కర్నె భిశ్వజిత్ ఆల్ ఇండియా 5929 ర్యాంక్ తో కర్ణాటక లోని బెల్గవ్ సైనిక్ స్కూల్లో సీటుసాధించినదుకు గురువారం కోటగిరి హై స్కూల్ లో భిశ్వజిత్ కు కోటగిరి మండల విద్యాధికారి నాదెండ్ల శ్రీనివాస రావు శాలువా తో ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో శ్రీనివాస రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి బాగా చదువు కొని భవిష్యత్ లో ఉన్నత స్థాయి కి ఎదగాలని ఆయన ఆకాంక్షిo చారు. తల్లి దండ్రుల ఆశయాలను నెరవేర్చలన్నారు. భీశ్వ జిత్ తండ్రి కర్నె గోపినాధ్ బోధన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించగా. తల్లి రూప కోటగిరి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల లో మ్యాథ్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తుంది.. భిశ్వజిత్ సైనిక్ స్కూల్ లో సీటు సాధించడం పట్ల తల్లి దండ్రులు. గ్రామస్తులు. ఎంఈవో శ్రీనివాస రావు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు పార్వతి, శ్రీనివాస్ రెడ్డి, హన్మాండ్లు, విశాల్, భూపేoదర్ తదితరులు పాల్గొన్నారు.