ఉమ్మడి జిల్లాలో తెరుచుకున్న పాఠశాలలు
బడిబాట పట్టిన విద్యార్థులు
బడిగంట మోగింది.. పాఠశాల తెరుచుకుంది. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. వారికి పలుచోట్ల ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. పూలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చి బడిలోకి ఆహ్వానించారు.
నిజాంబాద్, నమస్తే తెలంగాణ: బడి గంట మోగింది. సెలవులకు టాటా చెప్పిన విద్యార్థులు.. తల్లిదండ్రులకు టాటా చెబుతూ బడిబాట పట్టారు. వేసవి సెలవుల అనంతరం ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి తిరిగి పాఠశాలలు తెరుచుకున్నాయి. కొత్త ఆశలు, క్రొంగొత్త ఆలోచనలతో నూతన విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలతో స్వాగతం పలుకుతూ నోట్ బుక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు అందజేశారు.
అడ్లూర్ ఎల్లారెడ్డిలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించి ఆహ్వానం పలుకుతున్న టీచర్లు
దుబ్బ పాఠశాలలో ప్రార్థన చేస్తున్న విద్యార్థులు