ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 17: చావు నోట్లో తల పెట్టి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్ యావత్ తెలంగా ణ జాతికే రియల్ హీరో అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చచ్చు డో, తెలంగాణ వచ్చుడోనని రణనినాదం చేసి గ మ్యాన్ని ముద్దాడిన కేసీఆర్ తెలంగాణ జాతికే హీరో అని అభివర్ణించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అసా ధ్యం అనుకున్న తరుణంలో స్వరాష్ట్ర కాంక్ష రగిల్చి దానిని సుసాధ్యం చేసిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకుల కుట్రలకు ఎదురొడ్డి కేం ద్రం మెడలు వంచి, తెలంగాణను సాధించిన ఉద్య మ సూరీడు అని పేర్కొన్నారు.ఆయన జనహృదయ నేత, తెలంగాణ జాతిపిత అని, కేసీఆర్ జన్మదినం, తెలంగాణ ప్రజలకు పర్వదినమని తెలిపారు. ఆయురారోగ్యాలతో కేసీఆర్ నిండానూరేండ్లు వర్ధిల్లాలని సబ్బండ వర్గాల ఆశీర్వాదం లభిస్తుందన్నారు.
ఉద్యమ సూర్యుడు కేసీఆర్‌కు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఒంటరిగా బయల్దేరిన ఆయనను ఇందూరు గడ్డ అక్కున చేర్చుకున్నదని నాటి పరిస్థితులను జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ స్థాపనతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్‌కు మొదట జేజేలు పలికింది వేల్పూర్ మండలంలోని మోతె గ్రామమని తెలిపారు. బోధన్‌లో నిరాహార దీక్ష చేసి ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతుల తరుపున పోరాడి, కామారెడ్డిలో ‘ధూం-ధాం’ నిర్వహించి స్వరాష్ట్ర కాంక్షను సజీవంగా నిలిపారని వివరించారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటి నడిచారని, ఆనాటి నుంచి జిల్లాతో మొదలైన ఉద్యమ అనుబంధం తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా కొనసాగుతుందన్నారు. ఇందూరు గడ్డపై కేసీఆర్‌కు ఎంతో ఆప్యాయత ఉందని, అందుకే మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆయన ఉమ్మడి జిల్లాలోనే శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ శక్తిగా మారేందుకు దారి చూపిన ఊరు తమ ఆర్మూర్ అని పేర్కొన్నారు. 2014 మే 13న ఆర్మూర్‌కు వచ్చిన కేసీఆర్ మొదటి ఎమ్మెల్సీ టికెట్‌కు తన పేరును ప్రకటించడాన్ని జీవితంలో మరిచిపోలేనని జీవన్‌రెడ్డి చెప్పారు. ధరిత్రి దద్దరిల్లేలా చేసిన మహోద్యమ నేత కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని చెప్పా రు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణకు స్వర్ణయుగం మొదలవుతుందన్నారు. మళ్లీ ఆయన సీఎం కావాలనే లక్ష్యంతో అందరం కలిసి పని చేద్దామని పార్టీ శ్రేణులకు జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అన్నారు. డబ్బు, మద్యం, బెదిరింపులు అక్రమాలు, అరాచకాలతో గెలిచిన కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహాస్యం చేసిందని మండిపడ్డారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.