బోధన్, జనవరి 10: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, పాలకవర్గ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బోధన్ మార్కెట్ కమిటీ పురోగతిని ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ కవితకు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి పురియా నాయక్, డైరెక్టర్లు జాడె సతీశ్, వినోద్ నాయక్, వెంకటేశ్వరరెడ్డి, యాస్మిన్ బేగం, టీఆర్ఎస్ రైతు విభాగం బోధన్ పట్టణ అధ్యక్షుడు నక్క లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కవితకు కమ్మ సంఘం నాయకుల కృతజ్ఞతలు
బోధన్ కమ్మ సంఘం నాయకులు సోమవారం ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కమ్మ సంఘం నాయకులను కవితకు ఈ సందర్భంగా పరిచయం చేశారు. బోధన్‌లో కమ్మ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరుచేసినందుకు వారు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ కమ్మ సంఘం అధ్యక్షుడు పల్లెంపాటి శివన్నారాయణ, నాయకులు పీవీ సుబ్బారావు, పల్లెంపాటి శ్రీధర్, భవానీపేట్ సర్పంచ్ కృష్ణప్రసాద్, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పి.రవికిరణ్, సంఘం ప్రతినిధులు కొడాలి గోపి, పల్లెంపాటి శ్రీధర్, ఎం.అప్పారావు, గోగినేని నర్సయ్య తదితరులు ఉన్నారు.