నిర్మలమ్మ కరుణించేనా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టే తొలి బడ్జెట్‌పైనే అంతటా చర్చ జరుగుతున్నది.
- నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
- సీతారామన్‌పై ఉమ్మడి జిల్లా వాసుల ఆశలు
- ప్రధాని ప్రకటించిన పసుపుబోర్డుపై స్పష్టత కరువు
- బడ్జెట్లో నిధులు కేటాయించాలంటున్న రైతులు
- కొత్త రైళ్లు, రైల్వే లైన్, డబ్లింగ్పై గంపెడాశలు
- జక్రాన్‌పల్లి విమానాశ్రయంపైనా భారీ అంచనాలు
- వరాల మూట కోసం జిల్లావాసుల ఎదురుచూపు
నిజామాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టే తొలి బడ్జెట్‌పైనే అంతటా చర్చ జరుగుతున్నది. ప్రధానంగా పన్ను రాయితీలతో పాటు సామాన్యులపై ఏమేరకు వరాలు కురిపిస్తారన్న అంశంపై ఆసక్తి ఏర్పడింది. అలాగే, ఉమ్మడి జిల్లాకు బడ్జెట్లో ఏమాత్రం ప్రాధాన్యం దక్కుతుందన్నది చర్చనీయాంశమైంది. నిజామాబాద్, కామారెడ్డి రైతుల సుదీర్ఘ కల అయిన పసుపుబోర్డుకు నిధులు, కొత్త రైళ్లు, రైల్వే లైన్లు, డబ్లింగ్ తదితర అంశలపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ ఏర్పాటు ప్రతిపాదన ఈసారైనా పట్టలెక్కిస్తారా.. లేదా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
పసుపు బోర్డుకు నిధులిచ్చేనా?
పసుపు రైతుల దశాబ్దాల కలను నెరవేరుస్తున్నామని, పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసి 10 నెలలు పూర్తయ్యింది. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన సభల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. కానీ ఇప్పటివరకు పసుపుబోర్డు స్థాపనలో కదలిక లేదు. బోర్డుకు పైసా విదిల్చింది. అసలు ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న ప్రస్తావనే లేదు. కేంద్ర బడ్జెట్లో బోర్డుకు నిర్మలమ్మ నిధులు కేటాయిస్తారా? అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2019, 2023 ఎన్నికల్లో పసుపుబోర్డు అంశంతోనే బీజేపీ రెండుసార్లు నిజామాబాద్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్నది. గతంలో రైతులను మోసం చేసిన ఎంపీ అర్వింద్.. ఈసారైనా నిధులు తీసుకొస్తాడా? అని రైతాంగం ఎదురు చూస్తున్నది.
రైళ్లకు మోక్షమెప్పుడో..
రైళ్ల అభివృద్ధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎప్పుడూ వెనుకబాటులోనే ఉంది. వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందుతున్నప్పటికీ నిజాం కాలంలో వేసిన రైల్వే లైన్ మినహా ఇతరత్రా అభివృద్ధి అన్నది మచ్చుకైనా లేదు. 2014 నుంచి 2019లో ఎంపీగా కల్వకుంట్ల కవిత తీవ్ర పోరాటం చేసి పెద్దపల్లి – నిజామాబాద్ రైల్వే లైన్ పనులు పూర్తి చేయించారు. ఆ తర్వాత రెండుసార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ మాత్రం తనదైన ముద్ర వేసుకోలేకపోయారు. దేశ వ్యాప్తంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగంగానే నిజామాబాద్ వరకు రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఇందులో అర్వింద్ పాత్రేమీ లేదు. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్, ముంబైకి రైళ్ల సంఖ్యను పెంచాలని జిల్లా ప్రజలు చాలా ఏండ్లుగా కోరుతున్నారు. ఈమార్గంలో అరకొర రైళ్లను మాత్రమే నడుపుతున్న రైల్వేశాఖ గూడ్స్ రైళ్లను విరివిగా తిప్పుతూ భారీగా లాభాలను ఆర్జిస్తోంది. కానీ, ఈ ప్రాంత ప్రజల సౌకర్యాలను పట్టించుకోవడం లేదు. ఇక, డబ్లింగ్ లేకపోవడంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకల్లో తీవ్ర ఆలస్యమవుతున్నది. గూడ్స్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్యాసింజర్ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా సమస్యలను తీర్చేలా బడ్జెట్లో కొత్త రైళ్లు, డబ్లింగ్పై ప్రకటనపై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
విమానాశ్రయానికి మోక్షం కలిగేనా?
జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ ఏర్పాటు కలగానే మారింది. గతంలో కాంగ్రెస్, పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టుపై ఎటూ తేల్చలేదు. జక్రాన్‌పల్లిలో ఎయిర్ స్ట్రిప్ కోసం కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో అనేక మార్లు జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టుపై కేంద్రానికి విన్నవించారు. కానీ, మోదీ సర్కారు కనికరించలేదు. జీఎమ్మార్ ఎయిర్‌పోర్టుతో ఉన్న ఒప్పందాన్ని సాకుగా చూపి విమానాశ్రయ ఏర్పాటుపై అడుగు ముందుకు వేయడం లేదు. ఈ బడ్జెట్లోనైనా జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టుపై ప్రకటన వస్తుందేమోనన్న ఆశతో ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

