Summer camp | పెద్ద కొడపగల్, మే 05: పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నుండి 15 వరకు ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుండి 11:40గంటల వరకు ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మర్ క్యాంపులో స్పోకెన్ ఇంగ్లీష్, కరాటే, యోగాలను ఉచితంగా 13 ఏళ్లలోపు బాల బాలికలకు శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణకు కోర్సు డైరెక్టర్ గా ప్రధానోపాధ్యాయురాలు కమల, శిక్షకులుగా శివప్రసాద్, సాయిలు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వేసవి శిక్షణకు మండలంలోని ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులైన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అతను పద్యాలు కమల, శివప్రసాద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.