ఇందూరు/డిచ్పల్లి/కోటగిరి, ఆగస్టు 29 : జాతీయ క్రీడా దినోత్సవాన్ని జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో హాకీ, కబడ్డీ, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, ఉషూ పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న విజేతలకు షీల్డ్‌లు అందజేశారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల ఆవరణలో కేర్ ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్‌రెడ్డి హాజరై క్రీడాకారులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ ట్రెజరర్ రూ.4లక్షల విలువైన క్రీడా సామగ్రిని సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వేద్‌ప్రకాశ్, ఘనపురం దేవేందర్, శంభుని గుడి చైర్మన్ మహేందర్, కోచ్ గొట్టిపాటి నాగరాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ వ్యాయామ విద్యావిభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ వాసం చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరైనట్లు యూనివర్సిటీ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్చార్జి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖావి తెలిపారు. యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ నేత, అశోక్, మల్లికార్జున్, సాయిచరణ్, సురేశ్, గంగాధర్ పాల్గొన్నారు. కోటగిరి మండలం పొతంగల్ ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఆవరణలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో క్రీడాదినోత్సవాన్ని అథ్లెటిక్స్ క్రీడాకారులు ఘనంగా నిర్వహించారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కొంతసేపు హాకీఆడారు. యూత్ సభ్యులు సితాలే, మహేందర్, గాండ్ల సాయిబాబా, బాలరాజుగౌడ్, సూదం భూమ య్య, మేత్రి నాగేశ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో 2కే రన్
ఆర్మూర్, ఆగస్టు 29: ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం, లియో క్లబ్ నవనాథపురం ఆధ్వర్యంలో ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పట్టణంలో నిర్వహించిన 2కే రన్‌ను ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సైదేశ్వర్, రూరల్ సీఐ విజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను సన్మానించారు. లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు పుప్పాల శివరాజ్‌కుమార్, బిజ్జు సంతోష్, కోశాధికారి జ్ఞానీచావ్లా, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ మ్యాక మోహన్‌దాస్, ప్రతినిధులు రూపాలి నర్సయ్య, సత్యనారాయణ, చెన్న రవికుమార్, హరినారాయణ, ఆర్మూర్ యూత్ క్లబ్ అధ్యక్షుడు గట్టడి నితిన్‌కుమార్, సామాజిక కార్యకర్త విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.