వేతనాల పెంపుపై అంగన్వాడీల సంబురాలు
‘దళిత బంధు’పై దళిత సంఘాల హర్షం
మద్నూర్, ఆగస్టు 19: అంగన్వాడీ టీచర్లకు వేతనాల పెంపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా అంగన్వాడీ కేంద్రంలో గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీచర్లు, హెల్పర్లు క్షీరాభిషేకం చేశారు. తమకు వేతనాలు పెరగడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వేతనాలు పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, సర్పంచ్ హారిక, నాయకుడు శంకర్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరిలో..
కోటగిరి, ఆగస్టు 19: దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం దళిత సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత ఐక్యవేదిక కార్యాచరణ సమితి సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సీఎం, స్పీకర్ పోచారం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని, ముఖ్యంగా దళితుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌పటేల్,జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్‌పటేల్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్‌పటేల్, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, వైస్ చైర్మన్ జుమ్మాఖాన్, కిశోర్‌బాబు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు హెచ్.స్వరూప, వల్లెపల్లి శ్రీనివాస్, దళిత ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మిర్జాపూరం చిన్న సాయన్న, బేగరి రాములు, కాలే సాయిలు, పోచీరాం, కన్నం సాయిలు, పాల గంగారాం, ఆనంద్, అనిల్ కులకర్ణి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.