మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేలాదిమంది దళితులు ఉత్సాహంగా తరలివెళ్లారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి దళితుల కోసం పలు పథకాలు చేపట్టినప్పటికీ.. గత ప్రభుత్వాల చిత్తశుద్ధిలేమితో అవి నీరుగారాయి. అట్టడుగు వర్గాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నది. దళితుల అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధుకు పార్టీలకతీతంగా అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. దళితబంధు పథకం కోసం ఉమ్మడి జిల్లాలోని వేలాది కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం అందించే రూ.10లక్షల సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
నిజామాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దా లు గడిచినా నేటికీ దేశంలో, రాష్ట్రంలో దళిత ప్రజల స్థితిగతులు ఊహించిన స్థాయిలో మారలేదు. ఇప్పటి వరకు రూ.వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దళితుల అభ్యున్నతి కోసం జరిగిందేమీ లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో గతంలో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్, బీజేపీలు కేవలం ప్రచారాన్ని మాత్రం హోరెత్తించాయి. కానీ దళితుల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయాయి. ఈ సుదీర్ఘ కాలం లో కేవలం కొద్ది మంది దళిత కుటుంబాలు మాత్ర మే అభివృద్ధిలోకి రాగలిగాయి. పేదరికంలో మగ్గిపోతున్న వారిని చేయిచ్చి పైకి తీసుకు వచ్చిన వారే కరువయ్యారు. ఇన్నాళ్లకు అట్టగుడు స్థానంలో కొట్టుమిట్టాడుతున్న దళిత ప్రజల జీవితాలను సమూలంగా మార్చేందుకు చేసేందుకు కేసీఆర్ ప్ర భుత్వం కంకణం కట్టుకుంది. దేశమే ఆశ్చర్య పో యే విధంగా దళితబంధు పథకాన్ని తీసుకు వచ్చిం ది. సోమవారం కరీంగనర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం ద్రశేఖర్ రావు చేతుల మీదుగా దళిత బంధు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ చరిత్రాత్మక ఘట్టంలో పాల్గొనేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి వేలాదిమంది దళితులు తరలివెళ్లి తమ మద్దతును తెలియజేశారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం దళితబంధు పథకాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పటికే పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై విస్తృతంగా చర్చించగా అర్హులైన వారికి దళిత బంధు ఫలాలను సీఎం అందించారు. పథకం పూర్వాపరాలను సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రజలందరికీ విశదీకరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి. దళిత జాతిలోని పేదరికాన్ని రూపుమాపాలని ప్రవేశ పెడుతున్న తెలంగాణ దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిలా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న దళిత బంధు ఎజెండా మిగిలిన పథకాలకు పూర్తిగా భిన్నమైనది. పేదల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. దళిత కుటుంబాల్లో పేదరికాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు ఉద్దేశించిన దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీ స్థాయిలో ప్రజలు హుజూరాబాద్‌కు తరలి వెళ్లారు. ప్రత్యేక బస్సుల్లో ప్రతీ పల్లె నుంచి షెడ్యూ ల్డ్ కులాల్లోని ఆయా వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సీఎం సభకు కదిలారు. ప్రత్యేక బస్సుల్లో ఉదయ మే బయలుదేరిన వారంతా హుజూరాబాద్‌లో సీఎం సభకు హాజరై కేసీఆర్ ప్రసంగాన్ని విని సంతోషించారు. దళితబంధు ఉద్దేశాలను ఆయన మాటల్లోనే గ్రహించిన ప్రజలంతా కొండంత ధైర్యంతో ఇంటికొచ్చారు.
దశాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గు రవుతున్న దళితుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశాదీపం వెలిగించారు. ఆకలిని, అవమానాలను అనుభవిస్తూ అణిచివేతకు, అభద్రతకు గురవుతున్న దళితుల్లో సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి వారి స్వావలంబన కోసం రూ.వేల కోట్లతో ప్రకటించిన దళిత బంధు పథకం రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నవ శకానికి నాంది పలుకనున్నది. ఈ పథకం ద్వారా ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ప్రత్యేక లక్ష్యంతో చేపట్టిన దళిత సా ధికారత పథకానికి రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నారు. అర్హులైన వారందరికీ మేలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. ఇది దళిత ఉప ప్రణాళికకు అదనం. భూమి లేని కుటుంబాలకూ బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. కు టుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే, ఈ పథకం ద్వారా ఆ కుటుంబానికి భద్రత లభిస్తుంది. ఎస్సీలపై హింసకు పాల్పడే పోలీసులను డిస్మిస్ చేయాలన్న సూచనను ఆమోదించారు. భూసేకరణలో, అసైన్డ్ భూములకు కూడా పట్టా భూముల ధరనే ప్రభుత్వం చెల్లించే విధానం సైతం అమలు చేయబోతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దళిత కుటుంబాలు ఎంతో ఆశ గా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం అందించే రూ.10లక్షల సాయంతో ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏ యూ నిట్లు నెలకొల్పాలి. ఏ యూనిట్ పెడితే ఏ విధంగా లాభం ఉంటుందనే చర్చ దళి త వర్గా ల్లో జోరుగా సాగుతున్నది. అయితే ప్రస్తుతం ఈ పథ కం పైలట్ ప్రాజెక్టు కింద ప్రాథమిక దశలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 మందికి అమలవుతుంది. అనంతరం అర్హులైన వారందరికీ పథకాన్ని విస్తరించనున్నారు. దళితబంధులో లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకతీతంగా జరుగుతుంది. ప్రాథమిక దశలో ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు లబ్ధి చే కూరుస్తారు. రూ.10లక్షలతో ఏయే యూనిట్లను స్థాపించాలనే సమాచారం బుక్లెట్ల రూపంలో అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డెయిరీ, ఇతర స్వయం ఉపాధి పథకాలపై మార్గనిర్దేశనం చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. యూనిట్లు ప్రారంభించిన తర్వాత వాటిపై పర్యవేక్షణ ఉంటుంది. దీని కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మండల స్థాయిలో అధికారిని నియమిస్తారు. అధునాతన సాంకేతిక విధానాలను అవలంబించి, ప్రతి లబ్ధిదారునికి ప్రత్యేక గుర్తింపు కార్డును అందివ్వనున్నారు. ద శాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నిం పేందుకు గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు పార్టీలకతీతంగా సబ్బండ వర్ణాలు జేజేలు పలుకుతుండడం విశేషం.