నిజామాబాద్ సిటీ/ఇందూరు/ఖలీల్‌వాడి/ నిజామాబాద్ లీగల్/డిచ్పల్లి, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవ సంబురం అంబరాన్నంటింది. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా పరిషత్ ఆవరణలో చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణరెడ్డి, టీఎన్జీవోస్ కార్యాలయం ఆవరణలో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి గోవర్ధన్‌రెడ్డి, రైల్వే కోర్టు ప్రాంగణంలో మెజిస్ట్రేట్ సదాశివ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. టీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, తెలంగాణ యూనివర్సిటీలో వీసీ రవీందర్‌గుప్తా, నిజామాబాద్ నగర పాలకసంస్థ కార్యాలయం ఆవరణలో మేయర్ నీతూకిరణ్, మెడికల్ కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ ఇందిర, తెలంగాణ జాగృతి కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాంకిషన్‌రావు జెండాను ఎగురవేశారు.
సీపీ కార్తికేయ, అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్, ఏసీపీ వెంకటేశ్వర్లు, అగ్నిమాపక జిల్లా అధికారి మురళీమనోహర్‌రెడ్డి ఆయా కార్యాలయాల ఆవరణలో జాతీయ జెండా ను ఎగురవేశారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయం ఆవరణలో జిల్లా కార్యదర్శి బుస్సా ఆంజనేయులు, స్నేహసొసైటీ ఆవరణలో కార్యదర్శి సిద్ధయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
డిచ్పల్లిలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్‌లో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్‌రావు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం బెటాలియన్ సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వేముల, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, బిగాల, జడ్పీ వైస్ చైర్మన్ రజితాయాదవ్, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, సుమలత, దాసరి ఇందిరా, కమల, ఎంపీపీలు అనూష, లత, మై నార్టీ సెల్ అధ్యక్షుడు నవీద్ ఇక్బాల్, రాష్ట్ర కార్యదర్శి తారీఖ్ అన్సారీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, అపర్ణ, కుల్దీప్, సంతోష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.