నిజామాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నిజామాబాద్ సిటీ : ఊరూ, వాడ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించుకున్నది. నిజామాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా ఇందిరా గాంధీ క్రీడా మైదానంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వాతంత్య్ర ఉత్సవాల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. జిల్లా ప్రగతి నివేదనను ప్రజల ముందు సా క్షాత్కరించారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రగతి నివేదిక ఆయన మాటల్లోనే ఇలా ఉంది.
పల్లె ప్రగతి ముఖ్య ఉద్దేశం జిల్లాలో ప్రతి పల్లెను పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచడమే. దీనిలో భాగంగా రోడ్లను శుభ్రం చేయడం, ఇరువైపులా మొక్కలను నాటించడం, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చింది. జీపీలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డు నిర్మించాం. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలో పది ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నాం. 31వేల మొక్కలు నాటుతున్నాం. 2020-21లో పల్లె ప్రగతిలో భాగంగా రూ.167.08 కోట్లు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేశాం. 2021-22లో రూ. 30.90కోట్లు గ్రామ పంచాయతీలకు విడుదలయ్యాయి. పట్టణ ప్రగతిలో భాగంగా 2020-21లో రూ.66.34కోట్లు, 2021-22లో రూ.25.58కోట్లు నిధులు కేటాయింపులు జరిగాయి.
వానకాలం 2021-22లో ఇప్పటి వరకు 2లక్షల 39వేల 903 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.264.94కోట్ల్ల చెల్లింపులు జరిగాయి. 2020-21లో జిల్లాలో 1058 మంది రైతులకు రైతుబీమా క్లెయిమ్‌లు రూ.52.90కోట్లు చెల్లింపులు జరిగాయి. పంట రుణ మాఫీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 17,711 మంది రైతులకు 25వేలలోపు రుణం కలిగిన వారికి రుణ మాఫీ చేశాం. రెండో విడుతలో 50వేలలోపు రుణాలున్న 27,601 మంది రైతులకు రూ.85.85 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రహదారులు, భవనాల శాఖ ద్వారా నిజామాబాద్ జిల్లాలో రూ.1317కోట్లతో 207 పనులు మంజూరు చేశాం. వీటిలో 149 పనులకు రూ.1014 కోట్లతో చెల్లింపులు జరిగాయి. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. సమీకృత కలెక్టరేట్‌కు రూ.58.70కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేశాం. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 58 ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో 2,199 పడకలను ఉపయోగించి కొవిడ్ రోగులకు రెమ్‌డెసివిర్, పడకలకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. అర్హులైన వారికి కొవిడ్ టీకాలు ఇచ్చాం. ప్రభుత్వ దవాఖానల్లో బాలింతలకు 44,838 కేసీఆర్ కిట్లు పంపిణీ చేశాం.
శ్రీరాంసాగర్ జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి నీటిని నిజామాబాద్‌కు తాగు నీరుతోపాటు 4లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం ముఖ్య ఉద్దేశంగా నిజామాబాద్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపడుతున్నాం.
ప్యాకేజీ 20లో సర్జ్‌పూల్, పంప్ హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. సారంగపూర్ వద్ద 3 పంపులు, ఒక్కోటి 30 మెగావాట్స్ కెపాసిటీతో ఏర్పాటు అవుతున్నాయి. అక్టోబర్ 2021లో ఒక పంపును ప్రారంభించనున్నాం. ప్యాకేజీ 21లో సర్జ్‌పూల్, పంప్ హౌస్ నిర్మిస్తున్నాం. ఒక్కోటి 30 మెగావాట్స్ సామర్థ్యంతో మోటర్లు అమరుస్తున్నాం. ప్యాకేజీ 21ఎలో మెట్రాజ్‌పల్లి – మెట్పల్లి సెగ్మెంట్ పంప్ హౌస్ నిర్మాణం జరుగుతున్నది. నెట్వర్క్ పైప్‌లైన్ నిర్మాణం కొనసాగుతోంది. 2021, అక్టోబర్‌లో 20వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉ న్నాం. ప్యాకేజీ 21ఏ గడ్కోల్ సెగ్మెంట్లో వేగంగా పనులు జరుగుతున్నాయి. పంప్ హౌస్ నిర్మాణం పురోగతిలో ఉంది.
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకు వచ్చారు. త్వరలోనే ఈ పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.ధరణి వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 28,593 రిజిస్ట్రేషన్లు తహసీల్ కార్యాలయాల్లో పూర్తి చేశాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 14,786 మంజూరు చేయగా 14,182 పడకలకు పరిపాలన అనుమతులు రాగా
2021-22లో 2,548 మందికి కల్యాణలక్ష్మి అందించాం. షాదీముబారక్ ద్వారా 2021-22లో 832 మందికి చెక్కులు పంపిణీ చేశాం. హరితహారంలో భాగంగా పచ్చదనం పెంచడం కోసం 2021-22లో వివిధ శాఖల ద్వారా 59.20లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 47.83లక్షలు మొక్కలు నాటాం.