బిచ్కుంద/ బీర్కూర్/ విద్యానగర్/ బీర్కూర్/ సదాశివనగర్/మద్నూర్/ రామారెడ్డి, సెప్టెంబర్ 8 : జిల్లాల్లోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను బుధవారం ఎన్నుకున్నారు. బిచ్కుంద మండలం చిన్నదేవాడ, గుండేకల్లూర్ గ్రామాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. చిన్నదేవాడ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అట్కారి విఠల్, గుండెకల్లుర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా సాయిగొండతో పాటు సభ్యులను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో టీఆర్ఎస్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తాటిపల్లి సునీల్, కార్యదర్శిగా కాకర్ల రవికుమార్, కార్యవర్గసభ్యులుగా దుబ్బాక ప్రసాద్, సుతారి రాజును ఎన్నుకున్నామని ఎన్నికల ఇన్చార్జి మసూద్ అలీ తెలిపారు. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్, వీరాపూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీలను పార్టీ మండల అధ్యక్షుడు లాడేగాం వీరేశం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. తిమ్మాపూర్ గ్రామ అధ్యక్షుడిగా ఉప్పలపాటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా రమావత్ ప్రేమ్‌దాస్, అందె శంకర్, ప్రధానకార్యదర్శిగా షేక్ ఫయాజ్, సహాయ కార్యదర్శులుగా బొల్లి వెంకటేశ్వర్రావు, ఒల్లూరి నాగయ్య, కార్యవర్గసభ్యులుగా పల్లికొండ దత్తు, అయినాల సాయిబాబా, ఆకుల సాయాగౌడ్, శివనూరి రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా తడ్కల్ నారాగౌడ్, ఉపాధ్యక్షుడిగా మావురం హన్మాండ్లు, కార్యదర్శిగా గాండ్ల అశోక్, ప్రధాన కార్యదర్శిగా కుర్మ సాయిలు, సంయుక్త కార్యదర్శిగా ఎస్కే సాదక్, కోశాధికారిగా నిమ్మ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా మీసాల రాజయ్య, యూత్ విభాగం కన్వీనర్‌గా మీసాల సోమయ్యను ఎన్నుకున్నారు.
సదాశివనగర్ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా పెసరి సాయిలు, ఉపాధ్యక్షుడిగా పున్నం రాజయ్య, ప్రధానకార్యదర్శిగా చిందం రమేశ్, కార్యదర్శిగా డాక్టర్ అడ్డగుళ్ల సురేశ్ గుప్తా, సంయుక్త కార్యదర్శిగా జోగిని ఎల్లయ్య, ప్రచారకార్యదర్శిగా తక్కల భాస్కర్‌రెడ్డి, కోశాధికారిగా ఆస స్వామి, కార్యవర్గసభ్యులుగా సింగిరాయిపల్లి రాజేందర్, మంగళి సాయిలు, సార్గు రాజు, దుంపల రవి, వంగిటి సంజీవరెడ్డి, కొడిప్యాక శ్రీనివాస్, కుమ్మరి రాజయ్య, పొట్నగారి శివరాజును ఎన్నుకున్నారు. సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లిలో గ్రామ అధ్యక్షుడిగా కుప్రియాల నారాయణ, ఉపాధ్యక్షుడిగా కర్రోళ్ల లింగం, ప్రధానకార్యదర్శిగా నారెడ్డి భూంరెడ్డి, కార్యదర్శిగా రాజయ్య, సంయుక్త కార్యదర్శిగా సురేశ్, ప్రచార కార్యదర్శిగా మార గంగారెడ్డి, కోశాధికారిగా రవి, కార్యవర్గసభ్యులుగా గర్దాస్ లింగం, సంజీవరెడ్డి, నారాయణ, మూన్యా, మహిపాల్ రెడ్డి, నాగయ్య, పైడి లింగారెడ్డి, ఉప్పల్వాయి చిన్న రాములును ఎన్నుకున్నారు.
మద్నూర్ మండలంలోని పెద్దఎక్లారా, కొడిచిరలో గ్రామకమిటీలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పెద్దఎక్లారాలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా అశోక్, కొడిచిరలో సాయాగౌడ్‌తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
రామారెడ్డి మండలం కన్నాపూర్ తండా గ్రామ శాఖ అధ్యక్షుడిగా కెతావత్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా భోజు, ప్రధాన కార్యదర్శిగా రాము, రైతు బంధు సమితి కన్వీనర్‌గా కాట్రోత్ బలరాం, యూత్ విభాగం అధ్యక్షుడిగా శ్రీనివాస్, యూత్ విభాగం ఉపాధ్యక్షుడిగా రమేశ్, ప్రధానకార్యదర్శిగా వసంత్‌కుమార్‌ను ఎన్నుకున్నట్లు రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి తెలిపారు. గొల్లపల్లి గ్రామంలో ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెడ్డి మల్లేశ్, ప్రధానకార్యదర్శిగా వజ్జేపల్లి లింగం, ఉపాధ్యక్షుడిగా కె. నరేశ్, యూత్ విభాగం అధ్యక్షుడిగా జె.శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా జె.సుమన్, రైతు బంధు సమితి గ్రామ కన్వీనర్‌గా లింగం, బీసీ కమిటీ అధ్యక్షుడిగా మర్రి అంజయ్యను ఎన్నుకున్నారు.