సురక్షిత ప్రాంతాలకు తరలింపు
బాధితులతో మాట్లాడిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 7 : నగర శివారులోని గూపన్పల్లి గ్రామం వద్ద నిండుగా ప్రవహిస్తున్న పూలాంగ్ వాగు ఒడ్డున నివాసముంటున్న 120 మంది (32 కుటుంబాలు)ని ముందస్తు చర్యల్లో భాగంగా ఇతర ప్రాంతానికి తరలించారు. సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో ఆశ్రయం కల్పించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశం మేరకు వాగు గడ్డ ప్రాంత నివాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి చర్యలు తీసుకున్నారు. నిరాశ్రయులైన వారి వద్దకు కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, ఆర్డీవో రవి, తహసీల్దార్ ప్రశాంత్‌కుమార్, గిర్దావర్ భూపతిప్రభు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి చేరుకొని వారితో మాట్లాడారు. వారికి దుప్పట్లు, ఆహా ర పొట్లాలను అందజేశారు. నాల్గో డివిజన్లోని పాంగ్రా గ్రామశివారులో ఉన్న వాగు గడ్డపైన నివాసముంటున్న 60 మంది (15 కుటుం బా లు) కి కూడా సురక్షిత ప్రాంతమైన వడ్రంగి సం ఘ భవనంలో అధికారులు ఆశ్రయం కల్పించా రు. వీరికి దుప్పట్లు, ఆహార పొట్లాలను అందజేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందిన వారందరికీ తగిన సహాయక చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.