స్పీకర్, మంత్రిని కలిసిన జితేశ్ వీ పాటిల్
నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా డిప్యూటీ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు !
ఖలీల్‌వాడి, ఆగస్టు 31: నిజామాబాద్ నగర కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన జితేశ్ వీ పాటిల్‌ను ప్రభుత్వం కామారెడ్డి కలెక్టర్‌గా సోమవారం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. కృష్ణాష్టమి సందర్భంగా మంగళవారం సెలవు ఉండడంతో ఆయన బుధవారం రిలీవై కామారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. నగర కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రవికి కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.
స్పీకర్, మంత్రిని కలిసిన కామారెడ్డి కలెక్టర్ ..
బాన్సువాడ/వేల్పూర్, ఆగస్టు 31: కామారెడ్డి కలెక్టర్‌గా నియమితులైన జితేశ్ వీ పాటిల్ మంగళవారం హైదరాబాద్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఆయన అధికారిక నివాసంలో మద్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా మంత్రి నూతన కలెక్టర్‌గా నియమితులైన జితేశ్ వీ పాటిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.