MLC Kavitha | జూలై 17న రైల్ రోకో.. లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కోరారు.
హైదరాబాద్ : విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలోని ఎంబీ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesly), అడిక్‌మెట్‌లోని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వర రావు, జేవీ చలపతి రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె. గోవర్ధన్ తో ఎమ్మెల్సీ కవిత వేర్వేరుగా భేటీ అయ్యారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏడాదిగా అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్వహించామని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతితో పాటు బీసీ సంఘాలు చేసిన ఆందోళనలకు దిగివచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు మరో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింపజేసిందని కవిత వెల్లడించారు.
ఈ బిల్లును పంపి మూడు నెలలవుతున్నా అమలు చేయడానికి కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అందుకే జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని.. ఈ ఆందోళనకు మద్దతునివ్వాలని కమిత లెఫ్ట్ నేతలకు విజ్ఞప్తి చేశారు.

‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ అమలు కోసం తాము రెండేళ్లుగా ఉద్యమిస్తున్నామని.. తమ ఉద్యమాలకు తలొగ్గి అసెంబ్లీ, కౌన్సిల్ లో బిల్లులు ఆమోదించినా వాటికి చట్టబద్ధత కల్పించడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదని ఆమె దుయ్యబట్టారు. ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేయడంలో హాఫ్ సెంచరీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో ఒక్కసారి కూడా బీసీ బిల్లుల ఆమోదం కోసం ఒత్తిడి తేలేదని కవిత తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని.. కేంద్రం బీసీ బిల్లు కు ఆమోదముద్ర వేయాలంటే ఉద్యమబాట ఒక్కటే మార్గమని కవిత అన్నారు. అందుకే రైల్ రోకోకు పిలుపునిచ్చామని, తమతో కలిసి వచ్చే భావసారూప్యత ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి రైల్ రోకో నిర్వహిస్తామని ఆమె లెఫ్ట్ నేతలకు తెలిపారు.
ఆ విగ్రహాలను గాంధీ భవన్‌కు పంపిస్తాం
అధికారంలో ఉన్నామని ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో కాంగ్రెస్ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తుందని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాలను గౌరవ మర్యాదలతో గాంధీ భవన్‌కు పంపిస్తామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమ ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేయడం సరికాదని.. అది కాంగ్రెస్ తల్లి అని తాము మొదటి నుంచి చెప్తున్నామని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి
- Headingley Test | భారత్‌కు కలిసొచ్చిన ‘రెయిన్ బ్రేక్’.. ఆఖరి సెషన్లో ఈ ఇద్దరే కీలకం..!
- Prashanth Reddy | ఏం సాధించారని సంబురాలు..? రేవంత్‌రెడ్డిని ప్రశ్నించిన మాజీ మంత్రి వేముల
- Ramavaram : మరుగుదొడ్ల లేమి.. రుద్రంపూర్ ఐటీఐలో విద్యార్థినుల అవస్థలు
- Headingley Test | శార్దూల్ హ్యాట్రిక్ మిస్.. పటిష్ట స్థితినుంచి కష్టాల్లోకి ఇంగ్లండ్..!
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

