ఆర్మూర్, ఏప్రిల్ 22 : టీఆర్ఎస్ది అభివృద్ధి, కాంగ్రెస్, బీజేపీలది ప్రజలను నట్టేట ముంచే దుర్బుద్ధి అని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి అన్నా రు. పట్టణంలోని దోబిఘాట్ సమీపంలో రూ.25 లక్షలతో చేపట్టనున్న రజక భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. టీఆర్ఎస్కు అన్ని కులాలు సమానమేనని అన్నారు. సబ్బండ వర్ణాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు. కేసీఆర్ ముందుచూపు పాలనతో ప్రతి ఇంట్లో సంక్షే మం.. ప్రతి కంట్లో సంతోషం కనిపిస్తుందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ అద్భుతంగా పని చేస్తుంటే అభినందించడానికి బదులు అర్వింద్ అనే కేడీ నంబర్ వన్ ఎంపీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అర్వింద్ ఒక అబద్ధాల పుట్ట..అవినీతి గుట్ట అని విమర్శించారు. దమ్ముంటే ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధులు తీసుకురావాలని సూచించారు. టూరిస్ట్ మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణపై సోయి లేదని విమర్శించారు. తొండి మాటల బండి సంజయ్ పెద్ద తిరుగుబోతు అని, అరగుండు అర్వింద్ వాగుబోతు అని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అచ్చోసిన ఆంబోతు అని పేర్కొన్నారు. రెచ్చగొట్టడం, రచ్చ చేయడం, రోత పనులు చేసే ట్రిపుల్ ఆర్ బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి రాష్ర్టానికి శనిలా దాపురించారని మండిపడ్డారు. అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని తేకుండా రైతులను, ఎడమకాలు చెప్పుతో ముడుపు అంటూ ఎల్లమ్మతల్లిని, గౌడ కులస్తులను, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని,
దళితులు, గిరిజనులను అవమానించిన నీచుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్సాపల్లిలో మూడు కిలోమీటర్లు ఉరికిచ్చి కొట్టినా ఆయనకు బుద్ధి రాలేదన్నారు. ఏడున్నరేండ్లలో రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక ఏవో దొంగలెక్కలు చెప్పి అర్వింద్ పారిపోయారన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత పేరెత్తితే తరిమికొడుతామని హెచ్చరించారు. బీజేపీ మెడలు వంచి ఓడిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పం డిత్ వినిత పవన్, వైస్‌చైర్మన్ మున్నా, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మానస గణేశ్, పట్టణ అధ్యక్షుడు పడిగెల సురేందర్, కార్యదర్శి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.