గాంధారి : కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం గాంధారి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలని, శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. సీసీ కెమెరాలపై మండల ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక ఎస్సైకి చెప్పారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లోని పరిసరాలను, నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును ఎస్పీ పరిశీలించారు. దాంతోపాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్‌ను పరిశీలించి, వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంట ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్ గాంధారి ఎస్సై ఆంజనేయులు తదితరులు ఉన్నారు.