బాన్సువాడ రూరల్, జూన్ 20 : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సర్పంచులు, ఎంపీటీసీలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఐదో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచులు మా ట్లాడుతూ.. మన ఊరు..మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. అన్ని పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి రానున్నాయన్నారు. తల్లిదండ్రు లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరా రు. కార్యక్రమంలో సర్పంచులు నారాయణరెడ్డి, బోనాల సుభా ష్, సరళ, శ్రావణ్‌కుమార్, రామణారావు, రాజమణి, రాధ, నాన్కుబాయి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండలో..
దోమకోండ, జూన్ 20 : మండల కేంద్రంలోని దళితవాడలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలకు బంగారు భవిష్యత్తును అందజేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ఇందుకు తల్లిదండ్రులు కూడా కృషి అందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజలి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బీర్కూర్‌లో..
బీర్కూర్, జూన్ 20 : బీర్కూర్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఎంపీపీ రఘు ప్రజాప్రతినిధులతో కలిసి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు అవారి గంగారాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తిమ్మోజివాడిలో..
సదాశివనగర్, జూన్ 20 : సదాశివనగర్ మండలంలోని తిమ్మో జివాడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్పంచ్ స్వప్న, ఉప సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల కు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి విగ్రహానికి పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామం నుంచి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని తీర్మానం చేశామన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ మల్లయ్య, ఉప సర్పంచ్ రాజయ్య, టీఆర్ఎస్ నాయకుడు పెద్ద నర్సయ్య, హెచ్ఎం వాణి, ఉపాధ్యాయులు బాబాయ్య, మురళీకృష్ణ, సునంద్‌కుమార్, సాయిరెడ్డి, సీఆర్పీ నందురావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పిట్లం మండలంలో..
పిట్లం, జూన్ 20 : మండలంలోని రాంపూర్ క్లస్టర్ పరిధిలో ఉన్న మద్దెల చెరువు, కోమటిచెరువు తండా, గౌరారం తండా ప్రాథమిక పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిం చారు. సర్పంచులు పండిత్రావు, దేవారావు, రవి విద్యార్థుల కు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పలకలు, బలపా లు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, ప్రతాప్‌సింగ్, జ్యోతిలక్ష్మి, సీఆర్పీ గోపాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో..
నాగిరెడ్డిపేట్, జూన్ 20 : నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ వంజరి సునీత, మెల్లకుంటతండాలో జడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌రెడ్డి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.