బాన్సువాడ రూరల్ : కామారెడ్డి (Kamareddy) జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామంలో ఆదివారం అంతుచిక్కని వ్యాధితో దాదాపు 2 వేల బాయిలర్ కోళ్లు మృతి (Chickens die) చెందాయి. ఇప్పటికే తిర్మలాపూర్, బీర్కూర్ మండలంలోని చించోలి, కిస్టాపూర్ ఫారాల్లో 6వేలకు పైగా బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను తీసుకెళ్లి గుంతలు తవ్వి అందులో పూడ్చి పెట్టారు. కోళ్లు మృత్యువాత పడుతున్న పట్ల కోళ్ల ఫారాల నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందడం పట్ల వారు తీవ్ర ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. వైరస్ సోకిన ఒకటి రెండు రోజుల్లోనే కోళ్లు చనిపోతున్నాయని కోళ్ల ఫారాల నిర్వాహకులు పేర్కొన్నారు.