చందూర్ : చందూర్ (Chandur) మండల కేంద్రంలో శ్రీ సాయి విద్యాలయం ఉన్నత పాఠశాలలో ఏరోనాటికల్ డైరెక్టర్ డోసైటీ అఫ్ ఇండియా డాక్టర్ సతీష్ రెడ్డి ( Satish Reddy) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అబ్దుల్ కలాం(Abdul Kalam) ఇనిస్టిట్యూషన్ యూత్ ఎక్స్‌లెన్స్ వారు ఇస్రోకు(ISRO) సంబందించిన పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సతీష్‌రెడ్డి అబ్దుల్ కలాం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం చిన్న నాటి నుంచి కష్టపడ్డ తీరును వివరించారు. దేశం గర్వించేలా వరకు ఆయన కొనసాగించిన ప్రయాణాన్ని వెల్లడించారు. శాస్త్రవేత్తగా ఎదిగిన విషయాలను కులంకుశంగా విద్యార్థుల కు వివరించారు. విద్యార్థులు కలాంను ఆదర్శనంగా తీసుకొని లక్ష్యం కోసం కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.
ప్రపంచంలో భారతదేశం పటం రెపరెపలాడడం వెనుక కలాం లాంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ఎంఏ, నిజామాబాద్, డీఆర్డీఎల్, డీఆర్డీవో, ఎన్ఆర్ఎస్సీ, ఇస్రో(ISRO) సిబ్బంది మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల అధినేత ఉప్పల మధు,ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.