పెద్ద కొడగల్(పిట్లం) : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకోడప్గల్, ధర్మారం గ్రామాల్లో శుక్రవారం పశు ఆరోగ్యం, సంతానోత్పత్తి (Cattle Breeding Camp) శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మజీద్ మాట్లాడుతూ శిబిరంలో 67 గేదెలు, 24 ఆవులకు గర్భధారణ పరీక్షలు, 120 దూడలకు నులిపురుగులు మందులు (Deworming drugs) పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్, డాక్టర్ మణికుమార్, గోపాలమిత్ర సూపర్వైజర్ బస్వరాజ్, గోపాలమిత్రలు అహ్మద్ , గౌస్, పండరి ,ఓఎస్ శ్రీను, రైతులు పాల్గొన్నారు .