పెద్ద కొడప్ గల్ : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరంలో అఖండ హరినామ సప్తాహం కార్యక్రమాన్ని బుధవారం గ్రామస్తులు, సప్తాహం నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల 30 వరకు ఈ అఖండ హరినామ సప్తాహం కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం కాగడ హారతి, మధ్యాహ్నం గాత భజన, సాయంత్రం ప్రవచనం, రాత్రి 9 గంటలకు హరి భక్త పారాయణ మహారాజుల గారిచే కీర్తన కార్యక్రమం, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
రాత్రి హరిభక్త పారాయణ మాత అనుజా రెడ్డి కీర్తన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవన్నామ స్మరణ చేస్తూ జన్మను ధన్యం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు విట్టల్ మహరాజ్, గ్రామ పురోహితులు శ్రీపత్ రావు, దత్తు పంతులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.