ఇందూరు, అక్టోబర్ 10 : రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి మౌంటైన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 8 పతకాలు సాధించినట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌కాంత్ ఆదివారం తెలిపారు. టైమ్ ట్రయల్ మహిళల విభాగంలో శిల్పచౌహాన్ బం గారు పతకం, అండర్-18 బాలుర విభాగంలో జీఆర్. సమిత్ బంగారు పతకం, కె.రాఘవేంద్ర వెండి పతకం సాధించారని పేర్కొన్నారు. మాస్ స్టార్ట్ బాలికల విభాగంలో శిల్ప చౌహాన్ బంగారు పతకం, అండర్-18 బాలుర విభాగంలో జీఆర్. సమిత్ బంగా రు, వెండి పతకాలు, అండర్-16 బాలికల విభాగంలో బి. శ్రీముఖి బం గారు పతకం, బాలుర విభాగంలో షేక్ గౌస్ వెండి పతకాలు సాధించినట్లు వివరించారు. మొత్తం 5 బంగారు పతకాలు, 3 వెండి పతకాలు సాధించినట్లు చెప్పారు. జిల్లాకు పతకాల పంటపై జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు జి.కృపాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సూర్యప్రకాశ్, రాజ్‌కుమార్ సుబేదార్, ఒలింపిక్ సంఘం చైర్మన్ గడీల రాములు, రెజ్లింగ్ సంఘం కార్యదర్శి పి.నర్సింగ్‌రావు, సైక్లింగ్ సంఘం కార్యదర్శి బి.విజయ్‌కాంత్‌రావు హర్షం వ్యక్తం చేశారు. జట్టుకు కోచ్‌గా బి. దివాకర్‌రావు వ్యవహరించారు.