కామారెడ్డి, ఫిబ్రవరి 28 : మావోయిస్టుల సిద్ధాంతాలు నచ్చక ఇద్దరు మావోలు లొంగిపోయినట్లు కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్ర వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా లను వెల్లడించారు.నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యులైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల గ్రామానికి చెంది న గుర్రాల విజయ్ కుమార్,అలియాస్ ఆకాశ్, చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉట్టపల్లి గ్రామానికి చెందిన సోడి బాలకృష్ణ లొంగిపోయినట్లు తెలిపారు. వీరు పలు కేసుల్లో కీలక పాత్రధారులుగా ఉన్నట్లు చెప్పారు. సీపీఐ మావో యిస్టు పార్టీ పతనం అంచున ఉన్నదని, చత్తీస్గఢ్లో జరు గుతున్న ఘటనలు చూసి పార్టీలో కొనసాగడం సరికాదని లొంగిపోయారని తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో ఐదుగురు అజ్ఞాతంలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకోటి చందర్ రావు అలియాస్ పడకాల స్వాయి వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా ఉన్నాడని తెలిపారు. ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉండగా 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడని తెలిపారు. మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ దినేశ్, ఏసీఎం, ఆజాద్ ప్రొటెక్షన్ టీంలో ఉన్నాడని తెలిపారు. ఇతడిపై రూ.5 లక్షల రివార్డు ఉండగా, 2001 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడని పేర్కొన్నారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకోటి రమేశ్ అలియాస్ స్వామి, డీసీఎం,ఇన్చార్జి కొంటా ఏసీ, సౌత్ బస్తర్ డీవీసీగా ఉన్నాడని తెలిపారు.
ఇతడిపై రూ.5 లక్షల రివార్డు ఉండగా 2009 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడని తెలిపారు. ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకోటి లావణ్య ఏసీఎం గా పనిచేస్తున్నదని తెలిపారు. ఆమెపై రూ.4 లక్షల రివార్డు ఉండగా 2009 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడని పేర్కొన్నా రు. ఇందులో ఒకే కుటుంబం నుంచి లోకోటి చందర్ రావు, లోకోటి రమేశ్, లోకోటి లావణ్య ఉన్నారని వివరిం చారు. అజ్ఞాతంలో ఉన్నవారు జనజీవన స్రవంతిలో కలవాలని, అన్ని విధాల సహకారాలు అందిస్తామన్నారు. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరికి పోలీసు శాఖ తరపున సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు.జిల్లాలో మావోల కార్యకలాపాలు లేవని తెలిపారు. అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.