Kamareddy | కామారెడ్డి : ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ చూపించిన చొరవ సత్ఫలితాలు అందించిందని అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. బక్రీద్ పండుగ దృష్ట్యా, డ్రైవర్ల కొరత లేదా రవాణా కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కలెక్టర్ రవాణాదారులతో సమావేశం నిర్వహించారు. పండుగ సమయంలో నిరంతరాయంగా రవాణా సేవలు కొనసాగించాల్సిన ఆవశ్యకతపై సలహాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులు లేకుండా దానంతలింపు జరిగిందన్నారు.
వరి రవాణాలో మహారాష్ట్ర, కర్ణాటక నుండి వచ్చిన వారిని ప్రోత్సహించే మంచి కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగ్వాన్ మరియు అదనపు కలెక్టర్ విక్టర్ డ్రైవర్లకు బట్టలు, నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. కొనుగోలు సీజన్లో వారి సేవలు, సహకారానికి కృతజ్ఞతగా ఇది అందిచనున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం చూపిన ఈ చొరవను రవాణాదారులు, డ్రైవర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.