ఖలీల్‌వాడి/కామారెడ్డి, ఆగస్టు 16: కోల్‌కతాలోని ఆర్జీ కార్ వైద్యశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రకటించింది.
ఇందులోభాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉద యం 6 గంటల వరకు వైద్యసేవలను నిలిపివేస్తున్నట్లు కామారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రమ ణ, కార్యదర్శి డాక్టర్ అరవింద్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని పేర్కొన్నారు