ఖలీల్వాడి, మే 15: జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈనెల 17న ‘జాబ్ ఫెయిర్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ హరిప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ అడ్డా, షీ టీమ్, యాక్సిస్ బ్యాంకు, ఫాక్స్కాన్ తదితర కంపెనీల ప్రతినిధులు వస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ, డిప్ల్లొమా, ఇంటర్, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే పర్సనల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్లకు హాజరుకావాలని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడెటా, విద్యార్హత సర్టిఫికెట్లు, రెండు ఫొటోలు తీసుకుని రావాలని సూచించారు.