వినాయక నగర్ : నిజామాబాద్ (Nizamabad) నగరంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunck Drive ) లో పట్టుబడిన ముగ్గురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష (Jail Imprisonment) విధిస్తూ మెజిస్ట్రేట్ మంగళవారం తీర్పు వెలువరించారు. రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై యాసీన్ అరాఫత్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన సత్యనారాయణ అనే వ్యక్తిని మంగళవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ముందు హాజరు పరచగా రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
5వటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై గంగాధర్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన గంగా ప్రసాద్, సంజయ్ దిగంబర్ అనే ఇరువురిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా వారికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. ముగ్గురిని జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్సైలు వెల్లడించారు.