నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 7 : జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. పొతంగల్‌లో ఎస్బీఐ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ మంజూరు పత్రాలను బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ అందజేశారు. పొతంగల్‌లోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండలంలోని 36 మంది ఉపాధ్యాయినులను సన్మానించారు.
నగర శివారులోని అర్సపల్లిలో రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు. వినాయక్‌నగర్‌లోని జేసీఐ ఇందూరు క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశామన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా పీవోడబ్ల్యూ జిల్లా ప్రధానకార్యదర్శి భారతి హాజరై మాట్లాడారు.
జిల్లా పశు సంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ జగన్నాథాచారి ఆ శాఖలోని ఉద్యోగినుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఉద్యోగినులకు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. సిరికొండ మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో ప్రిన్సిపాల్ నర్సయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు హ్యాపీ ఉమెన్స్ డే ఆకృతిలో కూర్చొని ఆకట్టుకున్నారు. కోటగిరి హైస్కూల్ ఆవరణలో కిడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఐసీడీఎస్ జిల్లా పీడీ రసూల్‌బీ హాజరై, పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు.
బోధన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. పలువురు మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులను సన్మానించారు. బోధన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్, ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.రవికుమార్ మాట్లాడారు. సీనియర్ సివిల్ జడ్జి దేవన్ అజయ్‌కుమార్, అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి శేషతల్పశాయి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఆర్ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మహిళా అధ్యాపకులు, ఉద్యోగులు కేక్‌కట్ చేసి పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ పెద్దన్న, వైస్ ప్రిన్సిపాల్ భూపతి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు సన్మానించారు.
మహిళలు ఉన్నత చదువులు చదివి, అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించగా.. ఆమె హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదపపు న్యాయమూర్తి కనకదుర్గ, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఆశాలత, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ పద్మావతి, న్యాయమూర్తులు కుష్బూ ఉపాధ్యాయ, చైతన్య, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.