ఖలీల్వాడీ ( నిజామాబాద్ – కామారెడ్డి) : భారత దేశంలో మొట్టమొదటి సారి జరిగిన 8వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ లో కాలేయ వ్యాధులకు ( Liver diseases ) సంబంధించి రీసెర్చ్ స్టడీ పైన కామారెడ్డి జిల్లా ఆయుర్వేద వైద్యురాలు చైతన్య రమావత్(Chaitanya Ramawat) ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. వైద్యంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ ప్రశంస పత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. జిల్లాలో ఎలాంటి వైద్యమైన నాణ్యమైన వైద్యాన్ని అందించి అంతర్జాతీయ గుర్తింపు పొందడం జిల్లాకు గర్వకారణమని తోటి వైద్యులు అన్నారు.