Nizamabad | పోలీస్, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో డీ మార్ట్ లో తనిఖీలు.. ఫైర్ సేఫ్టీ పరికరాల చెకింగ్
నిజామాబాద్ పోలీస్, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎహెచ్వో శ్రీనివాస్, నిజాంబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి నగర శివారులోని కంఠేశ్వర బైపాస్ రోడ్డులో గల డీ మార్ట్ సూపర్ మార్కెట్ లో తనిఖీ చేశారు.
- ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన
Nizamabad | వినాయక నగర్, జూన్14 : నిజామాబాద్ పోలీస్, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎహెచ్వో శ్రీనివాస్, నిజామాబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి నగర శివారులోని కంఠేశ్వర బైపాస్ రోడ్డులో గల డీ మార్ట్ సూపర్ మార్కెట్ లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీ మార్ట్ నిర్వాహకులు ఏర్పాటుచేసిన ఫైర్ సేఫ్టీ పరికరాలు పైపులు, సీస్ ఫైర్ (అగ్ని ప్రమాదం సంబంధించినప్పుడు మంటలు ఆర్పేందుకు వినియోగించే ) వస్తువులను పరిశీలించారు. దీంతో పాటు ఫైర్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు బయటకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన అత్యవసర ద్వారాన్ని పరిశీలించారు.
అనంతరం అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలను అదుపు చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డీమార్ట్ లో ఉన్న సిబ్బందికి వివరించారు. అలాగే చిన్నపాటి మంటలు చలరేగినప్పుడు వాటిని చుట్టూ పక్కల వ్యాపించకుండా ముందుగా అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలని, అనంతరం సిబ్బంది వచ్చేవరకు మంటలను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో డీమార్ట్ సిబ్బందికి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

