ఇందల్వాయి/ కోటగిరి/ డిచ్పల్లి/ ధర్పల్లి, జనవరి 5 : జిల్లాలోని పలు పాఠశాలల్లో గురువారం నిర్వహించిన టీఎంఎల్మేళాలు ఆకట్టుకున్నాయి. ఇందల్వాయి మండలంలోని గన్నారంలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా టీఎల్ఎం మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎంపీపీ రమేశ్ నాయక్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, డీఈవో దుర్గాప్రసాద్ హాజరై మాట్లాడారు.
విద్యార్థులకు బోధనోపకరణాల ద్వారా సులభంగా పాఠ్యాంశాలు అర్థమవుతాయన్నారు. ఉపాధ్యాయులు రూపొందించిన వివిధ రకాల బోధనోపకరణాల ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. బోధనోపకరణాల ప్రదర్శనలో ప్రతిభచూపిన ఉపాధ్యాయులకు జడ్పీచైర్మన్ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం పీఆర్టీయూ క్యాలెండర్‌ను జడ్పీచైర్మన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంట మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌గౌడ్, నోడల్ ఆఫీసర్ సంగ్యానాయక్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్పీలు వెంకటేశ్వర్లు, సంతోష్, ఎంపీడీవో రాములు నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్, పీఆర్టీయూ నాయకులు రమేశ్, వేణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వర్ని మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఎఫ్ఎల్ఎంమేళాను నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు కళాత్మకంగా విద్యా బోధన, త్వరితగతిన విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, ఎంఈవో శాంతకుమారి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయిని వినోద, ప్రసాద్, గేమ్‌సింగ్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని ఘన్పూర్ పాఠశాలలో టీఎల్ఎం మేళాను నిర్వహించారు. మేళాను ఎంపీపీ గద్దెభూమన్న ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజగంగారాం, నోడల్ అధికారి నరేందర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మనోహరస్వామి, ఉషశ్రీ, జనార్దన్, రాఘవేందర్, ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్రావు, ఉపాధ్యాయ సంఘం బాధ్యులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎల్ టీఎల్ఎం మేళాను ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని సుమారు 60 మంది ఉపాధ్యాయులు తయారుచేసిన వివిధ బోధనోపకరణాలను పరిశీలంచారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్, ఎంపీడీవో నటరాజ్, తహసీల్దార్ గంగాసాగర్, మండల నోడల్ అధికారి వై.శ్రీనివాస్‌రెడ్డి, ‘మన ఊరు – మన బడి’ నోడల్ అధికారి శంకర్, హెచ్ఎం నారాయణ, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, పాల్గొన్నారు.