ఆర్మూర్ టౌన్ : పెరిగిన కరువు భత్యం (VDA) ను 2025 ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాలని IFTU రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూమన్న అన్నారు. బుధవారం ఆర్మూరు పట్టణంలో ఐఎఫ్టీయూ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన్న మీడియాతో మాట్లాడారు. బీడీ కార్మికులకు రోజుకు కనీసం 1000 బీడీల పని ఇవ్వాలని భూమన్న అన్నారు.
నెలకు 26 రోజుల పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారుకు రాష్ట్ర ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి జయ గంగాధర్, జిల్లా సహయ కార్యదర్శి భారతి ఉన్నారు.